1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 30 జనవరి 2023 (19:45 IST)

ముంబైలో 3BHK ఫ్లాట్.. సమంత రూ.15 ప్లస్ కోట్లు ఖర్చు చేసిందా?

Samantha
స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. ప్రస్తుతం అందరూ ఆమె ముంబై ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. సమంత తాను ఉంటున్న ప్రదేశం నుండి సూర్యాస్తమయం చిత్రాన్ని షేర్ చేసింది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తే, ఆమె ముంబైలోని స్కై స్క్రాపర్ బాల్కనీ నుండి కనిపించినట్లు తెలుస్తోంది. 
 
అది స్టార్ హోటల్ కూడా కాదు. ఆమె నివాస ప్రాంతమని తెలుస్తోంది ముంబై నగరంలో సముద్ర వీక్షణతో కూడిన 3BHKని సొంతం చేసుకోవడానికి సమంత సుమారు ₹15+ కోట్లు ఖర్చు చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత సిటాడెల్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైలో వుంటుంది. 
 
అలాగే రెండు బాలీవుడ్ చిత్రాలను కూడా ఓకే చేసిందని తెలుస్తోంది. తద్వారా సమంత ముంబై కెరీర్‌ను మళ్లీ ప్లాన్ చేయడానికి ముంబైలో మకాం వేసినట్లు తెలుస్తోంది.