సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By preethi
Last Modified: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (18:36 IST)

విదేశీ వనితతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న అర్జున్ రెడ్డి... నిజమా?

చిన్న సినిమా హీరోగా వచ్చి, భారీ విజయాల పరంపరతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి... అదేనండి విజయ్ దేవరకొండ ఓ విదేశీ వనితతో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈమె విజయ్ గర్ల్ ఫ్రెండ్ అని, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడ

చిన్న సినిమా హీరోగా వచ్చి, భారీ విజయాల పరంపరతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి... అదేనండి విజయ్ దేవరకొండ ఓ విదేశీ వనితతో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈమె విజయ్ గర్ల్ ఫ్రెండ్ అని, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత రీసెంట్‌గా గీతగోవిందం విడుదలై కలెక్షన్స్ సునామీ పుట్టించింది. 
 
ఇటీవల విడుదలైన నోటా ట్రయిలర్‌లో రాజకీయ నేతగా కనిపిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ నెలకొంది. ఇప్పుడు ఈ వార్తలతో పాటుగా డేటింగ్‌కు సంబంధించిన వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి. వర్జినీ అనే బెల్జియం వనితతో రొమాంటిక్ ఫోజులలో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌కు వర్జినీతో ‘పెళ్లి చూపులు’ సినిమా నుంచే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఆమె హైదరాబాదులోనే ఉంటోందని తెలిసింది. కేవలం ఈ ఫోటోలే కాకుండా విజయ్ కుటుంబ సభ్యులతో కూడా ఆమె సన్నిహితంగా ఉన్నట్లు బయటకు వచ్చిన ఫోటోలను చూస్తే తెలుస్తోంది. వీరిద్దరూ కేవలం స్నేహితులేనా లేక డేటింగ్ చేస్తున్నారా అనే విషయంపై నెట్టింట ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మరి దీనికి విజయ్ స్పందనేంటో మరి.