బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 జనవరి 2025 (16:07 IST)

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

DiL Raju office
DiL Raju office
తెలుగు సినిమారంగంలో ఇన్ కమ్ టాక్స్ దాడులు కొత్తేమీకాదు. నిర్మాతలు తమ సినిమా విడుదల తర్వాత ఫ్యాన్స్ పేరుతో తన పరపతి కోసం కలెక్లన్ల పరంగా వందల కోట్ల వసూళ్ళు అంటూ ప్రకటనలు చేయడం, ఆ తర్వాత ఐ.టి. దాడులు జరగడం మామూలే. అయితే ఈసారి కాస్త లేట్ గా ఐ.టి.దాడులు జరిగాయని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. ఇందులో రాజకీయ ఎత్తుగడ కూడా లేకపోలేదని తెలుస్తోంది.

ఒకవైపు తెలంగాణ సి.ఎం.  రేవంత్ రెడ్డి విదేశాల్లో వుండగా, ప్రతిపక్ష నాయకుడు కెటిఆర్.పై అవినీతి ఆరోపణలు, ఎంక్వీయిరీ జరుగుతుంది. ఈ సందర్భంగా కె.టి.ఆర్.ను అరెస్ట్ ఏ క్షణమైనా చేయవచ్చు అనే వార్త అటు సోషల్ మీడియాలోనూ, ఇటు బయటా ప్రచారం జరుగుతుంది. కానీ షడెన్ గా సీన్ మారి సినిమా రంగంపై డైవర్ట్ అయింది. దానితో కె.టి.ఆర్. ఇష్యూ పక్కదోవపట్టినట్లేనా? అనే ప్రచారం కూడా జరుగుతోంది.
 
Mytri movies office
Mytri movies office
సో.. రాజకీయపరంగా పాలక పార్టీకి వస్తున్న అపవాదులను డైవర్ట్ చేసేందుకు సినిమారంగంలో మాదకద్రవ్వాలు, ఐటీ. దాడులు చేయడమేనేది సాంప్రదాయంగా వస్తున్నాయంటూ ప్రముఖ నిర్మాత వెల్లడించడం విశేషం. గతంలో మహేష్ బాబు సినిమా టైంలో నూ మైత్రీమూవీస్ మేకర్ నిర్మాణ సంస్తలపైనా, ఇండ్లల్లోనూ దాడులు జరిగాయి.  అంతకుముందు కూడా ఇలాగే జరిగింది. కానీ ఫైనల్ గా అధికారులు తేల్చింది ఏమీలేదు. దానిమీద సోషల్ మీడియాలో పలురోజులపాటు కథనాలు వచ్చాయి.
 
ఈసారి మాత్రం గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నామ్ సినిమాల నిర్మాత దిల్ రాజు ఇంటిపైనా, బంధువుల ఇళ్ళలోనూ దాడులు జరగడం విశేసం. అసలు బలగం సినిమాను నిర్మించి రూపాయికి 100 రూపాయలు సంపాదించి పెట్టిన ఈ సినిమా తర్వాత దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి రెండు, మూడు సినిమాలు నిర్మించి ఓటీటీలో విడుదలచేసి సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు దిల్ రాజు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్టన్లు మామూలుగా లేవు. అటు బాలక్రిష్ణ సినిమా డాకు మహరాజ్ సినిమా కలెక్టన్ ను కూడా తగ్గించేసింది. అందుకే దిల్ రాజు ఆఫీస్, కొండాపూర్, బంజారా హిల్స్, మాదాపూర్ లలో బంధువుల ఇండ్లలోనూ దాడులు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం 7గంటలనుంచి దాదాపు 55 బ్రుందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. 200 మండి ఐటీ టీమ్ మూడుచోట్ల రైడ్ చేస్తున్నారని సమాచారం.
 
ఇక మైత్రీమూవీస్ నిర్మించిన పుష్ప 2 సినిమా గురించి తెలిసిందే. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో వెయ్యి కోట్ల రూపాయలు బిజినెస్ అయిందని ఇది వరల్డ్ రికార్డ్ అంటూ యాంకర్ సుమ చేత నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత సంథ్య థియేటర్ ఉదంతం జరగడంతో ఇష్యూ మరోవైపు మళ్లింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే. దీనిని బట్టి ఆ ఇష్యూ జరగకపోతే ఐ.టి. దాడులు ఎప్పుడో జరగాల్సి వుందని ఫిలింఛాంబర్ కు చెందిన ప్రతినిధి తెలియజేశారు. ఇప్పుడు మైత్రీ మూవీస్ వారు గాంధీ తాత చెట్టు అనే సినిమాను నిర్మించారు. 
 
ఇక మూడో వ్యక్తి వీరపనేని రామక్రిష్ణ. ఈయన మాంగో మీడియా అధినేత. ఆయన ఇంట్లో, ఆఫీస్ లోకూడా దాడులు జరిగాయి. డిజిటల్ మీడియాకు చెందిన ప్రతీ పెద్ద సినిమాను ప్రమోట్ చేసి ఓటీటీ వంటి ఫ్లాట్ పామ్ ను సుగమనం చేసే బిజినెస్ ఆయన. ఓ రకంగా ప్రముఖ నిర్మాతకు బినామీ అనే వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి.
 
ఏది ఏమైనా ఐటి దాడులు అనేవి కామన్. జమా లెక్కలు కరెక్ట్ గా వుంటే ఐటి.వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ అటూ ఇటూ గా వుంటే  కొంత ఫైన్ వేస్తారు. అంతకుమించి బ్రహ్మాండం బద్దలవదు అంటూ ఓ సీనియర్ నిర్మాత వ్యాఖ్యానించడం విశేషం. ఎంతో అనుభవంతో చెప్పిన ఆయన మాట్లల్లో ఇదో రాజకీయ ఎత్తుగడగా పేర్కొనడం కూడా నిజమేననిపిస్తుంది. సంక్రాంతికి కోట్ల రూపాయల కోడి పందాల్లో చేతులు మారాక తాపీగా వచ్చి ఐ.టి. దాడులు చేయడం కూడా వారికి ఏమీ దొరక్కపోవచ్చనేది కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.