గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:20 IST)

టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్

jhanvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తెలుగులో ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్‍‌కు భారీ ఆఫర్ వచ్చింది. ఈసారి ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్‌తో నటిస్తోంది. రామ్ చరణ్ RC16 సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో చేస్తున్నారు. 
 
ఇందులో జాన్వీ కపూర్ ప్రధాన హీరోయిన్‌గా ఎంపికైందని చాలా పుకార్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పల్లెటూరి డ్రామాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందని సమాచారం. 
 
బుచ్చి బాబు సనా కథను జాన్వీ కపూర్‌కి వివరించినట్లు తెలిసింది. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి జాన్వీ కపూర్ తెలుగులోని ఇద్దరు సూపర్‌స్టార్‌లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. మరోవైపు, మేకర్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ని ఫిక్స్ చేశారు.