ముగిసిన హనీమూన్... షూటింగులకు సిద్ధమంటున్న కాజల్

kajal - kitchlu
ఠాగూర్| Last Updated: బుధవారం, 18 నవంబరు 2020 (15:23 IST)
టాలీవుడ్ సీనియర్ నటి కాజల్ అగర్వాల్. గత నెల 30వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లారు. అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, ఓ ప్రైవేట్ రిసార్ట్స్ తీసుకుని సముద్ర గర్భంలో హనీమూన్ చేసుకున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అలా వారం రోజుల పాటు మాల్దీవుల్లో విహరించిన కాజల్.. ఇపుడు తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ముంబైకు చేరుకుంది. అంతేనా, తాను సంతకాలు చేసిన మూవీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆమె సమాయత్తమవుతోంది.

అందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న "ఆచార్య" చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపింది. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20 తేదీ నుంచి ప్రారంభంకానుంది. నిజానికి ఈషూటింగ్ ఈ నెల 9వతేదీ నుంచే ప్రారంభంకావాల్సివుంది. అయితే, చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత టెస్టింగ్ కిట్‌లో లోపం వల్ల చిరంజీవికి పాజిటివ్ అని వచ్చిందనీ, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. దీంతో ఆచార్య షూటింగులో కూడా చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాజల్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది.దీనిపై మరింత చదవండి :