మహేష్ నయా బిజినెస్ ప్లాన్? అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు గట్టి పోటీ!
మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్, మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఉన్న మహేష్ నయా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... ఇప్పుడు ఛానల్స్ కన్నా డిజిటిల్ స్ట్రీమింగ్ యాప్‌లకే ఊపు వస్తోంది. రాబోయే రోజులు పూర్తిగా డిజిటల్ స్ట్రీమింగ్‌దే హవా ఉంటుందని, వెబ్ సీరిస్‌లు రాజ్యం ఏలుతాయనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రస్తుతం కరోన వలన సమ్మర్లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఓటీటీ సంస్థలు చిత్ర నిర్మాతలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. థియేటర్స్‌లో రిలీజ్ చేయాలంటే చాలా టైమ్ పట్టేలా ఉంది. అప్పటివరకు ఆగితే ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి తీసుకువచ్చిన అమౌంట్‌లకు వడ్డీలు పెరుగుతాయి. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ద్వారా సినిమాలను రిలీజ్ చేద్దామంటే హీరోలు ఒప్పుకోవడం లేదు. దీంతో నిర్మాతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ప్రజెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌దే హవా నడుస్తుండటంతో మన హీరోలు ఈ వ్యాపారంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్పటికే తెలుగు సినిమా వాళ్లు ఆహా అంటూ ఒక యాప్ మొదలెట్టారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ వ్యాపారంలోకి దిగుతున్నాడని తెలిసింది. బాలీవుడ్ పత్రికలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. దీని కోసమని మహేష్ కొన్ని సినిమాలను కూడా తీయిస్తాడని, వెబ్ సీరిస్‌లు కూడా ప్లాన్లో ఉన్నాయని సమాచారం.
మొత్తానికి ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి అవి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌లు ఈ విషయంలో స్పష్టమైన లీడ్‌లో కనిపిస్తున్నాయి. మిగతావి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి తోడు మహేష్ తరఫున కూడా ఒకటి రంగంలోకి దిగితే ఆయా సంస్థలకు మరింత పోటీ ఏర్పడడం ఖాయమని షాక్ అవ్వడం ఖాయం.