మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (17:13 IST)

అక్టోబర్‌లో వివాహం.. 'యూ-టర్న్' తీసుకున్న సమంత?

పవన్ కుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజైన కన్నడ సినిమా ''యూటర్న్''. థ్రిల్లర్ స్టోరీ అయిన ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ (చెలియా ఫేమ్) నటించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ

అక్టోబర్‌లో టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత వివాహం అట్టహాసంగా జరుగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సమంత యూటర్న్ తీసుకుందని వార్తలొస్తున్నాయి. యూటర్న్ తీసుకుందా? అంటే పెళ్లి మళ్లీ వాయిదా వేసిందా అనే అనుమానం కలుగుతుందా? కాస్త ఆగండి ఈ స్టోరీ చదవండి. సమంత యూటర్న్ తీసుకుంది.. పెళ్లి విషయం కాదు.. సినిమా విషయంలో. 
 
పవన్ కుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజైన కన్నడ సినిమా ''యూటర్న్''. థ్రిల్లర్ స్టోరీ అయిన ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ (చెలియా ఫేమ్) నటించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఇందులో హీరోయిన్‌గా సమంతను ఖరారు చేశారు. 
 
అయితే అక్టోబర్‌లో ఆమెకు వివాహం జరుగనుండటంతో యూ-టర్న్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. సమంత తప్పుకోవడంతో ఆమె స్థానంలో నిత్యామీనన్‌ను యూటర్న్‌కు కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.