శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:26 IST)

అవకాశాలు వస్తాయో లేవో.. పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్?

Pavitra Lokesh
ప్రముఖ నటులు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంపై టాలీవుడ్‌లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా పవిత్ర రెమ్యూనరేషన్ విషయంలో పాపులర్ అయ్యింది. పవిత్ర లోకేష్ కన్నడ నటి అయినా.. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 
 
ప్రముఖ హీరోల సినిమాల్లో తల్లిగా నటించి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఆమెకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. ఇక ఇటీవల శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా.. ఈమె నరేష్ ఇద్దరూ కలిసి నటించడంతో.. వీరిద్దరి సన్నివేశం థియేటర్లలో వచ్చినప్పుడు ఈలలు గోలలు చేశారు సినీ ప్రేక్షకులు.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషకం కూడా భారీగా పెంచేసింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ పారితోషకం విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల క్రితం వరకు ఆమె రోజుకు 60 వేల రూపాయలను మాత్రమే పారితోషికంగా తీసుకునేది.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఏకంగా లక్షల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం. ఒక్కో సినిమాకు లక్ష రూపాయలు రోజుకు పారితోషకం డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ వ్యవహారంతో సినీ అవకాశాలు వస్తాయో లేవో.. అందుకే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్ వస్తోంది.