బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (19:42 IST)

రాఖీబాయ్ రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే?

Pooja Hegde Look
కేజీఎఫ్ హీరో యశ్ తాజా సినిమాలో పూజా హెగ్డే నటించనుందని టాక్. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని, యశ్ సినిమా కోసం ఆమెను ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాల నుంచి క్లారిటీ వస్తోంది. 
 
ప్రస్తుతం పూజా హైదరాబాద్‌లో జరుగుతోన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమా షూట్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకుడు.
 
ఇదిలా వుండగా.. కేజీఎఫ్2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేజీఎఫ్3కి మేకర్స్ శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సినిమాలోనే మరో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఆడియన్స్ నుంచి దానికి డిమాండ్ వచ్చిపడింది.
 
ఈ క్రమంలోనే కేజీఎఫ్3 ఉంటుందని, మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఎప్పట్నుంచి ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 
 
ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తోనూ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి, కేజీఎఫ్3 సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.