సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:33 IST)

ఆమె మాయలో పడిపోయిన 'మాటల మాంత్రికుడు'.. మళ్లీ మరో ఛాన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పేరుంది. ఈయన తీసే చిత్రాల్లో ఒక హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుంటారు. గతంలో ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. సమంతతో మూడు సినిమాలు చేశారు. పూజాతో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. మూడో సినిమా ఛాన్స్ కూడా ఈమెకు ఇవ్వనున్నట్టు సమాచారం. 
 
గతంలో 'అరవింద సమేత' చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్‌ను పూజా హెగ్డే కొట్టేసింది. ఆ తర్వాత తాజాగా వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించింది. ఈ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం. ఇపుడు కొత్తగా తీయబోయే చిత్రానికి కూడా పూజానే ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. 
 
త్వరలో ఎన్టీయార్‌తో చేయబోతున్న సినిమాలోనూ పూజనే తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. పూజ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. అందుకే సెంటిమెంట్‌గా మూడో సినిమాలోనూ పూజనే నాయికగా ఎంచుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. మరోవైపు రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి, ఈ సినిమాలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.