ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:45 IST)

మనసు నిండిన మీ ఆదరణకు... ఇప్పటికి ఇక శెలవు....

మాజీ ఎంపీ, సీనియర్ నటి విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఇప్పటికి ఇక శెలవు అంటూ ఆమె ట్వీట్ చేశారు. దాదాపు పుష్కరకాలం తర్వాత విజయశాంతి వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అత్యంత కీలకమైనపాత్రను పోషించి మెప్పించారు. 
 
'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి, హీరో మహేశ్ బాబుకు, ఆదరించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన నట ప్రస్థానానికి 1979 'కల్లుక్కుల్ ఈరమ్', 'కిలాడి కృష్ణుడు' నుండి 2020 'సరిలేరు నీకెవ్వరు' వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ప్రజా జీవనంలో మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో లేదో తెలియదన్నారు. ఇప్పటికి ఇక శెలవని.. మనసు నిండిన మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.