బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (20:30 IST)

ప్రభాస్.. రాధకు సలహా ఇచ్చాడా? ఇంతకీ ఏంటా సలహా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించారు. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే.. తనకున్న క్రేజ్‌కు తగ్గట్టుగా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్నాడు. అలాగే బాహుబలి సినిమాకి ఎంత టైమ్ పట్టిందో తెలిసిందే. అందుకనే ఇక నుంచి సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాడట. ఇటీవల సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. 
 
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్నారు. ఇది పీరియాడిక్ లవ్ స్టోరీ. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. 
 
తాజా షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌ని ఆయన సన్నిహితులు రాధా అని పిలుస్తారు. జిల్ తర్వాత ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్న రాధాకృష్ణ కుమార్ ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలిసింది.
 
 ఇదిలా ఉంటే... ఈ సినిమా డైరెక్టర్ రాధాకు ప్రభాస్ ఓ సలహా ఇచ్చారని తెలిసింది. అది ఏంటంటే... బాహుబలి, సాహో సినిమాల్లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉండడం వలన చాలా ఎక్కువ టైమ్ పట్టింది. అందుచేత ఈ సినిమాలో గ్రాఫిక్స్ లేకుండా ఒరిజినల్ లోకేషన్స్ లోనే చేయమని చెప్పారట. అందుకనే గ్రాఫిక్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. ఒరిజినల్ లోకేషన్స్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో కృష్ణంరాజుపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
 
ప్రభాస్, పూజా హేగ్డేపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని... వీళ్లిద్దరి మధ్య చిత్రీకరించిన లవ్ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ రాధా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ సినిమాని ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.