శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 24 నవంబరు 2017 (19:37 IST)

నయనతార కన్నా నాది తక్కువేం కాదంటోన్న రకుల్‌ప్రీత్ సింగ్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాగా తగ్గిపోతోందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత భారీ బడ్జెట్ మూవీలో నటించినా నిర్మాత ఇచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని చెబుతోంది. ఎన్నో సినిమాల్లో నటించాను. అన్నీ భారీ హిట్లే. నిర్మాతలు బాగా సంపాదించుకుంట

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాగా తగ్గిపోతోందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత భారీ బడ్జెట్ మూవీలో నటించినా నిర్మాత ఇచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని చెబుతోంది. ఎన్నో సినిమాల్లో నటించాను. అన్నీ భారీ హిట్లే. నిర్మాతలు బాగా సంపాదించుకుంటున్నారు. మాకు మాత్రం న్యాయం జరగడం లేదు. 
 
దక్షిణాది స్టార్‌గా ఉన్న నయనతారకే ఇప్పటికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అది చాలా తక్కువ. నయనతార కన్నా నేనేమీ తక్కువేం కాదు. నాకు అన్నీ ఎక్కువే. నా సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ రెమ్యునరేషన్ మాత్రం పెరగడం లేదు. నిర్మాతలను పెంచమంటే వారు పెంచడం లేదు. ఇక విధి లేక సినిమాను ఒప్పుకుని చేసేస్తున్నానంటోంది రకుల్ ప్రీత్ సింగ్.