ఈ జన్మదినం ఎప్పటికీ మరచిపోలేను : సీనియర్ నటి రమ్యకృష్ణ

నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసి తన ఆనందాన్నిఅభిమానులతో పంచుకుంది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈరోజును ప

chitra| Last Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:14 IST)
నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసి తన ఆనందాన్నిఅభిమానులతో పంచుకుంది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈరోజును ప్రత్యేకంగా నిలిపిన అభిమానులకు, కుటుంబసభ్యులకు ఫేస్‌బుక్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తన భర్త కృష్ణవంశీ, కుమారుడు తదితరులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను పోస్ట్‌ చేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం 'జాగ్వార్‌', 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'శభాష్‌ నాయుడు' తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.దీనిపై మరింత చదవండి :