గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (19:12 IST)

పుష్ప-2 షూటింగ్‌లో జాయిన్ అయిన శ్రీవల్లి

Srivalli
పుష్ప-2 షూటింగ్‌లో శ్రీవల్లి జాయిన్ అయ్యింది. పుష్ప సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పైగా ఆ సినిమాలో ఓ సాంగ్‌లో రష్మిక వేసిన స్టెప్, బాగా వైరల్ అయింది. దీంతో పుష్ప-2లో శ్రీవల్లి ఎలా ఉండబోతోందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
రష్మిక ఇటీవలే రణబీర్ కపూర్ నటించిన యానిమల్ షూటింగ్‌ను ముగించి, పుష్ప-2లో పాల్గొంది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘యానిమల్’ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్ద లేఖ రాసింది పుష్ప-2. 
 
యానిమల్ షూటింగ్‌ను దాదాపు 50 రోజులు పూర్తి చేసింది రష్మిక. దానికి గ్యాప్ ఇచ్చి పుష్ప-2లో పాల్గొంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.