శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (17:57 IST)

పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న అల్లు అర్జున్

alluarjun   planted plant
alluarjun planted plant
నేడు  ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అల్లు అర్జున్ ఒక మొక్కను నాటారు  తన ఇంటిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు. మొక్క బతికితే మనం బతుకుతాం అంటూ కాప్షన్ చెప్పారు. పర్యావరణం పట్ల అల్లు అర్జున్ నిబద్ధత తెలియజేస్తుంది. 
 
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన  రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. అనసూయ భరద్వాజ్, అజయ్, సునీల్, జగదీష్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందుతోంది.