శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 18 జనవరి 2020 (20:11 IST)

అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి: సాయిపల్లవి

సహజ నటిగా సాయిపల్లవికి పేరుంది. సహజత్వం..అందరితో కలివిడితనం..ఎంత కష్టమైనా సన్నివేశాన్ని అయినా అవలీలగా చేయగల హీరోయిన్ సాయిపల్లవి. ఇది అందరికీ తెలిసిందే. ఆమె సినిమాలు చూసిన వారికి ఇది బాగానే తెలుస్తుంది. అయితే నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. 
 
నాకు చిన్నతనం నుంచి వైద్యురాలిని కావాలన్న ఆశ ఉండేది. డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాను. నాకు లెక్కలంటే చాలా భయం. లెక్కలు చేయాలంటేనే వణికిపోతూ ఉండేదాన్ని. నిజంగా చెప్పాలంటే లెక్కలకు భయపడి చదువు మానేస్తే చివరకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
 
సినిమాల్లో నటిస్తానని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు నాకు వస్తున్న అవకాశాలు మాత్రం మామూలుగా లేదు. అందుకే నేను నాకు మంచి జరిగినా, చెడు జరిగినా అలా జరిగిందా... సరే అని లైట్ తీసేసుకుంటుంటా. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోను. నాకు మరీ ముఖ్యం అనే దానిని మాత్రం తేలిగ్గా తీసుకోను అంటోంది సాయిపల్లవి. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.