శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 16 నవంబరు 2017 (20:25 IST)

సాయి పల్లవే కావాలంటున్న శర్వానంద్

ఫిదా సినిమా తరువాత సాయిపల్లవికి బోలెడన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలను చేస్తోంది. ఇప్పటికే నానితో సినిమా చేస్తున్నారు సాయి పల్లవి. ఈ సినిమా చేస్తుండగానే ఆమెకు మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే కథ నచ

ఫిదా సినిమా తరువాత సాయిపల్లవికి బోలెడన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే పల్లవి మాత్రం ఆచితూచి సినిమాలను చేస్తోంది. ఇప్పటికే నానితో సినిమా చేస్తున్నారు సాయి పల్లవి. ఈ సినిమా చేస్తుండగానే ఆమెకు మరికొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే కథ నచ్చితేనే సాయిపల్లవి ఆ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటోంది. కానీ కొంతమంది హీరోలు మాత్రం సాయిపల్లవితోనే సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందులో శర్వానంద్ ఒకరు.
 
మహానుభావుడు సినిమా తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలన్న ఆలోచనలో దర్సకుడు ఉండగా శర్వానంద్ సాయిపల్లవి పేరును చెప్పారు. ఆమె అయితే ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది. ఈ కథ ఆమెకు బాగా సూట్ అవుతుందని చెప్పాడు శర్వానంద్. దర్సకుడు సాయిపల్లవితో మాట్లాడగానే ఆమెకు కథ నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.