సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (22:11 IST)

శంకర్-చెర్రీ సినిమా- నేతాజీగా పవన్.. బొమ్మపడితే ఇంకేమైనా వుందా?

pawan kalyan
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి మోడరన్ రోజుల్లో ఉన్న రామ్ చరణ్‌కి తండ్రి పాత్ర. 
 
ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారక్టర్ ఉంటుందట. ఆయన వీరోచిత పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రామ్ చరణ్ అదే బాటలో పయనిస్తాడట.ఆ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని సంప్రదించారట శంకర్. 
 
కేవలం వారం రోజుల కాల్షీట్స్ సరిపోతాయని శంకర్ అడిగినట్లు తెలిసింది. ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీనిపై త్వరలో శంకర్ అధికారిక ప్రకటన చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే బాక్సాఫీస్ బద్ధలు కావడం ఖాయమని సినీ పండితులు చెప్తున్నారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వున్న క్రేజ్‌కి ఆయనని నేతాజీ లాంటి లెజెండ్ పాత్రలో చూడడం అంటే అభిమానులకు ఇక పూనకం వచ్చినట్లే అవుతుంది. శంకర్-పవన్-చరణ్ కాంబో తెరపై పడితే ఇంకేమైనా వుందా?