ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (12:40 IST)

చిరంజీవి అంతటి గొప్ప స్టార్‌ని హేండిల్ చేయలేను మహాప్రభో: అవసరాల శ్రీనివాస్

''ఊహ‌లు గుస‌గుస‌లాడే'' చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో, హాస్య‌న‌టుడు అవ‌స‌రాల శ్రీనివాస్‌. ఆయ‌న ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద షూటింగ్ శరవేగంగా జరుగుతోంది‌. ఈ సినిమా ప్ర‌మోష

''ఊహ‌లు గుస‌గుస‌లాడే'' చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో, హాస్య‌న‌టుడు అవ‌స‌రాల శ్రీనివాస్‌. ఆయ‌న ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద షూటింగ్ శరవేగంగా జరుగుతోంది‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పాడు. చ‌దువుకునే రోజుల్లో చిరంజీవి గారి సినిమాల‌ను ప‌రీక్ష‌లు ఎగ్గొట్టి మ‌రి చూశాన‌ని తెలిపాడు. 
 
ఆయనంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఇంతవరకు ఓకే గాని ఆయనతో కలిసి సినిమా తీయనని చెప్పడం అందరిని అబ్బురపరిచింది. ఆయనను తెరపై చూడడం వేరు, ఆయనను తెరపై చూపించడం వేరని చెప్పాడు. అంత హీరోయిక్‌‌గా తాను సినిమాలు తీయలేనని ఆయన స్పష్టం చేశాడు. చిరంజీవి అంత స్టార్‌ను తాను హేండిల్ చేయలేనని నిజాయితీగా ఒప్పుకుంటున్నానని తెలిపాడు.