శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వి
Last Modified: బుధవారం, 15 జులై 2020 (19:38 IST)

చిరుతో మరోసారి తమన్నా...

సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ మొదటిసారి చిరంజీవితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
 
కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో షూటింగ్ చేసుకోబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అయ్యింది. ఈసినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే సైరాలో షేర్ చేసుకున్న తమన్నా మరోసారి చిరుతో ఆడిపాడుతుందని సమాచారం.