బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (17:22 IST)

అక్కడ ఉప్పెనను తిప్పికొట్టారు, కారణం హీరో ప్రైవేట్ పార్ట్ సీన్ నచ్చలేదనీ...

Allu Arjun, upeena team
సినిమాకు ప‌బ్లిసిటీ ముఖ్యం. విడుద‌ల‌కు ముందు విడుద‌ల త‌ర్వాత బాగుంద‌ని ట‌పాసులు పేల్చుకోవ‌డం ఆన‌వాయితీగా మారింది. చిన్నా పెద్ద హీరోల సినిమా అని చూడ‌కుండా అంద‌రూ ఒకే రూటులో వెళుతున్నారు. ఈమ‌ద్య బాగా ప‌బ్లిసిటీ ఇవ్వ‌డ‌మేకాకుండా చిత్ర క్రూ అంతా థియేట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి హుషారు చేయ‌డం, చివ‌రికి ఆ ద‌గ్గ‌ర‌వున్న దేవాల‌యాల‌కు వెళ్ళ‌డం. అదొక ప్ర‌చారంగా మారింది.

మార్కెట్ ప్ర‌కారం ప్ర‌తీదీ ప‌బ్లిసిటీ అనేది ముక్యం. దాన్ని చ‌క్క‌గా చేసింది `ఉప్పెన‌` టీమ్‌. విడుద‌లైన రోజునే 3కోట్లు పైగా గ్రాస్ వ‌చ్చింద‌ని లెక్క‌లు చూపించి ఆ త‌ర్వాత రోజురోజుకూ పెరిగింద‌నే లెక్క‌లు చూపించారు. మొత్తంగా ఈ సినిమా బాగానే ఆడింది, వ‌సూలు చేసింద‌నేది య‌దార్థ‌మే. కానీ, ఓవ‌ర్‌సీస్‌లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమైన వాతావ‌ర‌ణ నెల‌కొంది.

అక్క‌డ సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులులేక వెల‌వెలబోయాయి. ఓవ‌ర్‌సీస్ రిపోర్ట్ ఆధారంగా ఇక్క‌డ  పంపిణీదారులు చెప్పిన‌దాన్నిబ‌ట్టి ఓవ‌ర్‌సీస్‌లో ఉప్పెన సినిమాను తిప్పికొట్టార‌ని పేర్కొన‌డం ఆశ్చ‌ర్యంగా వుంది. మెగాస్టార్ మేన‌ల్లుడు అయినా స‌రే ఆ సినిమాను చూడ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిచూప‌లేద‌ని చెబుతున్నారు. పైగా హీరో వ్యక్తిగత భాగాన్ని హీరోయిన్ తండ్రి కట్ చేసిన సీన్ పెద్దగా ఆకట్టుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎటొచ్చి ఆంధ్ర‌, తెలంగాణాలో సినిమా బాగానే వుంద‌నే టాక్ వుంది. అయితే ఇక్క‌డ చూపిస్తున్న లెక్క‌ల‌కు క‌లెక్షన్లు చాలా వ్య‌త్యాసం వుంద‌ని ఓ పంపిణీదారులు తెలియ‌జేయ‌డం విశేషం.
 
కాగా, బుధ‌వారంనాడు ఉప్పెన నిర్మాత‌లు అల్లు అర్జున్‌కు ప్ర‌త్యేక‌మైన షో ప్ర‌ద‌ర్శించారు. చిత్రం చూసిన అనంత‌రం వైష్ణ‌వ్‌తేజ్‌ను అల్లు అర్జున్ అభినందిస్తూ మంచి హిట్ కొట్టావ‌ని శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం అక్క‌డే వున్న ద‌ర్శ‌కుడు బుజ్జిబాబు సాన‌ను అస‌లు ఈ పాయింట్ ఎలా త‌ట్టింద‌ని అడిగి మ‌రీ తెలుసుకున్నారు. ఇందులో త‌క్కువ కులం వాడైన హీరో త‌న కుమార్తెను లేపుకెళ్ళాడ‌నే అక్క‌సుతో విల‌న్, హీరోకు మ‌గ‌త‌నంలేకుండా చేస్తాడు. ఈ పాయింట్ ఓవ‌ర్‌సీస్ వారికి డైజెస్ట్‌కాలేదని తెలిసింది.