శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (13:26 IST)

ఉదయభానుకి భారీ రెమ్యూనరేషన్.. బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇస్తుందా?

Udayabhanu
బుల్లితెర యాంకర్ ఉదయభానుకి భారీ రెమ్యూనరేషన్ దక్కింది. బిగ్ బాస్ షోలో ఉదయభాను ఎంట్రీ ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సీజన్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. అదేవిధంగా బుల్లితెర నటులు యాంకర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 
 
ఇండస్ట్రీలో నటిగా యాంకర్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకి పెద్ద ఎత్తున ప్రియారిటి ఇస్తున్నట్లు సమాచారం. యాంకర్‌గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకు ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది.  
 
నిర్వాహకులు ఆమెకు ఊహించని విధంగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి ఉదయభాను గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.