ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (23:18 IST)

వెంకీ మూవీ శర్వానంద్ దగ్గరకి వచ్చిందా..?

యువ హీరో శర్వానంద్‌కి ఇటీవల వరుసగా ఫ్లాప్స్ రావడంతో.. కథల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇక నుంచి మంచి కథా బలం ఉన్న కథలతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. పడిపడి లేచే మనసు, రణరంగం, జాను.. ఇలా వరుసగా ఫ్లాప్ అవ్వడంతో శర్వానంద్ ఆశలు అన్నీ శ్రీకారం సినిమా పైనే ఉన్నాయి. కరోనా కారణంగా సమ్మర్‌కి రావాల్సిన ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి.
 
ఇదిలా ఉంటే... విక్టరీ వెంకటేష్ చేయాల్సిన సినిమా శర్వానంద్ దగ్గరకి వచ్చిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే... నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల వెంకటేష్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఆయన కోసం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే కథ రెడీ చేసారు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
 
ఇప్పుడు ఈ కథ శర్వానంద్ దగ్గరకి వచ్చింది. కిషోర్ తిరుమల చెప్పిన ఈ కథ శర్వానంద్‌కి బాగా నచ్చిందట. వెంటనే ఓకే చెప్పాడని టాక్. ప్రస్తుతం కిషోర్ తిరుమల ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. మరి... వెంకీతో చేయాలనుకున్న ఈ కథ శర్వానంద్‌కి సెట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.