శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (16:54 IST)

నయనతారతో పెళ్లా? మలయాళ బ్యూటీ లవ్వాయణంపై పెదవి విప్పిన విఘ్నేష్‌!

నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక‌ లవ్‌ఎఫైర్‌తో లైమ్ లైట్‌లో ఉంటోంది. మొదట్లో తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇప్పుడు తమిళ యువ డైరెక్టర్ విఘ్నేష్ శివ. ఇలా నయనతార ప్రేమాయణాలు కంటిన్యూ అవుతున్న

నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక‌ లవ్‌ఎఫైర్‌తో లైమ్ లైట్‌లో ఉంటోంది. మొదట్లో తమిళ హీరో శింబు, ఆ తర్వాత నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఇప్పుడు తమిళ యువ డైరెక్టర్ విఘ్నేష్ శివ. ఇలా నయనతార ప్రేమాయణాలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ పెళ్ళి ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 
 
పైగా, విఘ్నేష్‌ శివన్‌తో ఉన్న ప్రేమాయణంపై నయనతార ఎన్నడూ ఖండించలేదు. స్పందించలేదు కూడా. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ నిజమేనని చాలా మంది అంటున్నారు. అయితే, వీరిద్దరూ ప్రేమలో పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో, ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 
 
ఈనేపథ్యంలో నయన్‌తో ప్రేమాయణం, పెళ్లి గురించి విఘ్నేష్ వద్ద ప్రస్తావించగా, త‌న దృష్టాంతా కూడా కెరియర్‌పైనే ఉందనీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పేశాడు. పైగా, నయనతార గురించి ఒక్క మాట స్పందించలేదు. మరి నయనతార రెస్పాన్స్ ఏంటో తెలీదు.