శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:14 IST)

'అభినందన్' పాత్రలో విజయ్ దేవరకొండ : ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానమ్మా అంటూ...

వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గురించి తెలియని భారతీయులు ఉండరు. శత్రువుల చేతుల్లో చిక్కినప్పటికీ మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శిచిన తిరిగి స్వదేశానికి సగర్వంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళం సైనికుడు. అంతేనా.. చావుకోరల్లో చిక్కుకున్నప్పటికీ.. శత్రుసైన్యానికి ఒక్క రహస్యం కూడా వెల్లడించని యుద్ధ విమాన పైలెట్. ఈయన దేశంలో అమాంతం రియల్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 
 
ఇపుడు అభినందన్ పాత్రలో టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ టీ సిరీస్ నిర్మాణంలో వచ్చే ఈ చిత్రంలో విజయ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.
 
మరోవైపు, విజయ్ దేవరకొండ తల్లి మాధవి గురువారం 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే అమ్మా" అంటూ ట్వీట్ చేశారు. 'నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానమ్మా' అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా పోస్టు చేశారు.
 
అందులో విజయ్ దేవరకొండ, ఆయన తల్లి, సోదరుడు క్రికెట్ షాట్ కొడుతున్న సరదా సన్నివేశం చూడొచ్చు. హ్యాపీ 50 అమ్మా అంటూ విజయ్ పేర్కొన్నారు. తల్లి రియల్ లైఫ్‌లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుందంటూ పైవిధంగా తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో పలు వేదికలపై వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తుంటారు.
 
కాగా, విజయ్ తల్లి బర్త్ డే పార్టీకి ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా విచ్చేసింది. విజయ్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో రష్మిక ప్రధాన ఆకర్షణగా నిలవడం గమనార్హం. వీరిద్దరూ "గీతగోవిందం" చిత్రంలో తొలిసారి కలిసి నటించిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.