శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:42 IST)

అధికమాసంలో రామ అంటే.. కోటి రెట్ల ఫలితం..

అధికమాసం అంటే ఏ మాసంలో సంక్రమణం ఉండదో అదే అధిక మాసం. ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు, ఇంట్లోకి ప్రవేశించడం, ఉపనయనాల వంటివి చేయకూడదు. 
 
అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలైన సత్యనారాయణ వ్రతం, దేవుళ్లకు అభిషేకాలు, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం, రామాయణ పారాయణం, ఆంజనేయస్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి. 
 
నిత్యం ఇష్టదైవాన్ని తలచుకుని ధ్యానం చేయడం లేదా జపం చేయడం వంటివి చేస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఉదాహరణకు మిగిలిన మాసాల్లో ఒకసారి రామ అంటే, ఒక్కసారే ఫలితం వస్తుంది. అయితే ఈ అధిక మాసంలో అంటే మాత్రం కోటి రెట్ల ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. 
 
అధిక మాసంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఈ అధిక మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది. అయితే అన్నిదానాల్లో కన్న మిన్న అయిన అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యా దానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.