బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:56 IST)

కోలీవుడ్‌లో మార్మోగిపోతున్న విజయ్ సేతుపతి పేరు.. రూ.40 కోట్లు పారితోషికం?

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది. ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యిందంటే దానికి కారణం విజయ్ సేతుపతి అని కోవీవుడ్ టాక్. విజయ్ సేతుపతి నటనతో ఆ చిత్రాన్ని ఎక్కడో తీసుకెళ్లారనే కామెంట్స్ వినొస్తున్నాయి. 
 
అంతేకాకుండా, మరోవైపు, హీరోగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, విలన్‌గా నటించే అనేక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. దీంతో విజయ్ సేతుపతి పేరు మార్మోగిపోతోంది. 
 
'తెన్ మెర్కు పరువ కాట్రు' హిట్ తర్వాత, ప్రతియేటా హిట్ మీద హిట్ సాధిస్తూ విజయ్ సేతుపతి ముందుకు సాగుతున్నాడు. ఏ భాషలో మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో 'మక్కల్ సెల్వన్'గా అభిమానులు పిలుచుకునే విజయ్ సేతుపతి తాజాగా, అతనికి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆఫర్ చేసిన మొత్తాన్ని చూస్తేనే సినీ వర్గాల మైండ్లు బ్లాంక్ అవుతున్నాయి.
 
పాన్ ఇండియా వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకుంటున్న ఓ ప్రాజెక్టులో షాహిద్ కపూర్, రాశీ ఖన్నాలతో కలిసి విజయ్ సేతుపతి నటించేందుకు సైన్ చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం అతనికి 55 కోట్ల రూపాయల పారితోషికం లభించనున్నదట. 
 
ఇక ఇదే ప్రాజెక్టులో భాగమైన షాహిద్ కపూర్‌కు రూ.40 కోట్లే దక్కనున్నాయని సినీ వర్గాల సమాచారం. ఈ మెగా వెబ్ సిరీస్ 'సున్నీ' పేరిట తయారవుతుండగా, రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్‌లోగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.