గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 20 నవంబరు 2018 (12:00 IST)

వై.ఎస్ బ‌యోపిక్ 'యాత్ర'లో జ‌గ‌న్ పాత్ర పోషించేది ఆయనేనా..?

వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను యాత్ర పేరుతో సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మహి.వి. రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వై.ఎస్ పాత్రను మలయాళ అగ్ర‌హీరో మమ్ముట్టి పోషిస్తున్నారు. మమ్ముట్టి బాగా ఇన్వాల్వ్ అయి వైఎస్ రోల్‌లో నటిస్తున్నారని చెబుతుంది చిత్ర బృందం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే.. ఈ చిత్రంలో వై.ఎస్ జ‌గ‌న్ పాత్ర ఉంటుంద‌ని తెలిసింది. 
 
జగన్ పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే స్క్రీన్ పైన కనిపిస్తోందని తెలుస్తోంది. అంటే ఓ గెస్ట్ రోల్‌లా జగన్ పాత్ర సినిమాలో కనిపించనుంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ పాత్ర‌లో ఎవరు నటిస్తున్నారనేది ఆస‌క్తి పెరిగింది. అయితే జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ గాని, లేదా తమిళ్ స్టార్ కార్తీగాని నటించనున్నారని వార్తలు వచ్చాయి. 
 
మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, గెస్ట్ రోల్ కాబట్టి ఏకంగా ఆ కొద్దిసేపు జగన్ మోహన్ రెడ్డి కనబడతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే యాత్ర ఓ రేంజికి వెళ్లిపోవడం ఖాయం. వై.ఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ప్ర‌జెంట్ బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రి.. వై.ఎస్ బ‌యోపిక్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.