శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (15:43 IST)

అంతులేని పీవీపీ ఆగడాలు.. పోలీసులపై జాగిలాలు వదిలిన వైకాపా నేత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్ ఆగడాలు అన్నీ ఇన్నీకావు. ఆయన పాల్పడిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విధుల్లో ఉన్న పోలీసులకు తన ఇంట్లోని జాగిలాలను వదిలినట్టు వార్తలు వచ్చాయి. దీంతో హైదారాబాద్, జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో అరెస్టు చేయడానికి పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. దీంతో పీవీపీ వ్యవహారంపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పీవీపీని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్ళగా వారిపై జాగిలాలను వదిలిపెట్టినట్టు సమాచారం.