గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (19:26 IST)

18 పేజెస్ కు యూత్ తో పాటు పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు : నిఖిల్ సిద్దార్థ

Nikhil Siddhartha
Nikhil Siddhartha
18 పేజెస్ సినిమా చేసే టప్పుడు మొదట తెలుగు మాత్రమే చేద్దాం అనుకున్నాము కానీ పాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకోలేదు.ఇప్పుడు ఈ రషెష్ చూసిన తరువాత హిందీ కి వెళ్లాలా లేదా అనేది ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేస్తారు.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని హీరో సిద్దార్థ తెలిపారు. శుక్రవారమే థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్బంగా  హీరో నిఖిల్ పలు విషయాలు చెప్పారు. 
 
- కార్తికేయ వంటి అడ్వెంచర్ సినిమా తరువాత చేస్తున్న 18 పేజెస్ సినిమా చాలా ఇంటెన్సివ్ క్రేజీ లవ్ స్టోరీ చేయడం చాలా హ్యాపీ గా ఉంది..నాకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా ఇష్టం.అయితే నేను మొదటి సారి ఎమోషనల్ ఫిలిం చేశాను. సుకుమార్ గారి రైటింగ్స్ కాబట్టి బాగా ఇన్వాల్వ్ అయ్యి నా క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారు.అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాలో ఉన్న నా క్యారెక్టర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉన్నందున పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు
 
- మొన్న జరిగిన 18 పేజెస్ ప్రమోషన్ టూర్ లో భాగంగా 18 సిటీస్ కు వెళ్ళాలి అనుకున్నాము. అయితే 14 సిటీస్ మాత్రమే కవర్ చేశాము. ఇంకా 4 సిటీస్ కు వెళ్లాల్సి ఉంది. అయితే మేము వెళ్లిన ప్రతిచోట మేము అనుకున్న దానికంటే ఎక్కువగా కొన్ని వేల మంది రావడం జరిగింది.ఈ టూర్ కార్తికేయ థాంక్స్ మీట్ లాగా పనికొచ్చింది. అలాగే 18 పేజెస్ ప్రమోషన్స్ కు కూడా బాగా కలిసొచ్చింది. కాబట్టి ప్రేక్షకులందరూ కార్తికేయ 2 సినిమాను ఎలా లవ్ చేసి సొంతం చేసుకొని ఆదరించారో ఈ సినిమాను అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
- 18 పేజెస్ సినిమా ఇది ప్యూర్ లవ్ స్టోరీ.స్టూడెంట్స్ కి యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ అయిన సరే మళ్లీ కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎందుకు బ్రేకప్ ఎందుకు అయ్యాము ఎలా అయ్యాము వారు రీ కనెక్ట్ ఎలా అయ్యారు అనే విధంగా చాలా ఏమోషనల్ గా వుంటుంది. ఇది సోషల్ మెసేజ్ కాదు కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అవుతారు.
 
- సుకుమార్ గారు మార్క్ లవ్ స్టోరీ కాబట్టి ఆయన మార్క్ కు తగ్గట్టే రాసిన లవ్ స్టోరీ ఉంటుంది. సుకుమార్ గారి రైటింగ్ లో ఒక క్రెజీ లవ్ స్టోరీ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఇందులో నేను సిద్దు పాత్రలో నటిస్తున్నాను. దర్శకులు సూర్యప్రతాప్ పల్నాటి చాలా బాగా తీశాడు. గోపి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. మంచి  కథతో వస్తున్న ఈ సినిమాకు అందరూ ఓపెన్ మైండ్ తో రండి. సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా ఫ్రెష్ ఫీల్ తో బయటకు వస్తారు.
 
- అనుపమ తో కార్తికేయ సినిమా చేసే టైమ్ లో ఆ సినిమాకు చాలా రోడ్ జర్నీ చేశాము. అప్పుడే తనతో మంచి బాండింగ్ ఏర్పడింది. మళ్ళీ తనతో రెండో సినిమా కూడా చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా ఉంటుంది. తను నందిని క్యారెక్టర్ కోసం చాలా కష్టపడింది.
 
- కార్తికేయ 2 తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమాల్లో  నార్త్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ప్లాన్ చేసుకుంటున్నాను. దాని ప్రకారంగా ఇక ముందు సెలెక్ట్ చేసే ప్రతి కథలో నేషనల్ వైడ్ కు టచ్ ఉండేలా చూసుకుంటూ అన్ని భాషల ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటాం.  ఈ సినిమా తరువాత వచ్చే స్పై తరువాత వచ్చేరెండు సినిమాలు కూడా అన్ని భాషల ఆడియన్స్ కి నచ్చేలా ఉంటాయి.