సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (15:37 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. ఇక సీబీఐకి.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

sushanth singh
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీహార్ పోలీసుల విచారణను సవాలు చేస్తూ సినీ నటి రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సమాచారాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
 
సుశాంత మరణం కేసు విచారణ ముంబయిలో జరపాలని రియా చక్రవర్తి తన పిటిషన్‌లో అభ్యర్థించారు. కొద్ది రోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసు స్టేషన్‌లో రియాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. 
 
సుశాంత్ సింగ్ నుంచి రియా డబ్బులు తీసుకున్నారని, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే బీహార్ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. కాగా, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ప్రాణాలు లేకుండా కనిపించారు. ముంబయి పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా భావిస్తూ, విచారణ చేపట్టారు.
 
రియా చక్రవర్తీతో సహా హిందీ సినీరంగానికి చెందిన కొందరు ప్రముఖులను ముంబయి పోలీసులు ఈ కేసు విషయమై ప్రశ్నించారు. మహేశ్ భట్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు కూడా ఇందులో ఉన్నారు.