పూరీని డైరెక్ట్ చేసిన రామ్... అవును.. ఇది నిజం
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లేటెస్ట్ సెన్సేషన్ ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ హీరో రామ్, నభా నటేష్, నిథి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బష్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ.. సరికొత్త రికార్డులు దిశగా దూసుకెళుతుంది. ఈ మూవీ టైటిల్ సాంగ్‌లో పూరి జగన్నాథ్ కూడా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
అయితే.. పూరి కనిపించే ఆ సీన్‌కి హీరో రామ్ దర్శకత్వం వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర నిర్మాత ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రామ్ ‘‘ఓ కొత్త యాక్టర్‌ని డైరెక్ట్ చేయబోతున్నాను’’ అని చెప్పటం మనం చూడవచ్చు.
అయితే... ఈ ట్వీట్‌ని రామ్ రీట్వీట్ చేశాడు. పూరి జగన్ అనే కొత్త కుర్రాడు.. యాక్టింగ్ ఇర్రగ్గొట్టేశాడు అంటూ రామ్ పేర్కొన్నాడు. అయితే.. సార్.. నెక్ట్స్ టైం కొంచెం పెద్ద రోల్ ఇవ్వండి సార్ ప్లీజ్ అంటూ పూరి... రామ్‌కి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.