సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 జులై 2019 (15:41 IST)

పూరీ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ అందుకున్న‌ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలో పూరి జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన అభిమానులకి, ప్రేక్షకులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇకపై మాస్ సినిమాలు మాత్రమే తీయాలి అని నిర్ణయించుకున్నానని చెప్పారు. 
 
అంతేకాకుండా ఇస్మార్ట్‌ని ఘన విజయం చేసిన ప్రేక్షకులని కలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో విజయోత్సవ టూర్‌ని ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తికరం అంశం ఏంటంటే.. పూరి జగన్ ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆ విజయోత్సవ యాత్ర ముగియగానే డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ పైన పని మొదలు పెట్టనున్నట్లు కూడా తెలిపారు. రామ్ నెక్ట్స్ మూవీని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. మ‌రి.. ఈ మూవీ త‌ర్వాత డ‌బుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.