బిగ్ బాస్-3 ఫేం దర్శన్ వాడుకుని వదిలేశాడంటున్న తమిళ సినీ నటి! (Video)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ నటి చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-3 తమిళ ఫేం దర్శన్ త్యాగరాజన్ మోసం చేశాడని ఆరోపించింది. ఒక యేడాది రిలేషన్ పేరుతో తనను వాడుకుని ఇపుడు వదిలేశాడనీ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ దర్శకుడి కోసం గాలిస్తున్నారు.
ఇంతకీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి సనమ్ శెట్టి. ఈమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.
కాలక్రమంలో ఆమెకు బిగ్ బాస్-3 ఫేం దర్శన్ త్యాగరాజన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్‌తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.
మలేషియాలో ఉంటున్న దర్శన్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషనులో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.