సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (16:35 IST)

సీతగా కృతి సనన్.. ఆదిపురుష్‌ చేతిలో సినిమాలు.. సూపర్ హిట్ కొడుతుందా?

బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న పాన్ ఇండియా చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించిన తర్వాత కృతి సనన్‌ ను ఈ పాత్రకు ఎంపిక చేసారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రంతో కృతి సనన్ రేంజ్ భారిస్థాయిలోకి చేరుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 
అయితే ఇప్పుడు కృతి సనన్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయ్. ఆదిపురుష్‌ చిత్రంతో పాటు అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్షయ్ పాండే, హౌజ్ ఫుల్ ఐదవ సీజన్, యాక్షన్ ఫిలిం గనపత్‌, ఎమోషనల్ సినిమా మిమి, కామెడీ సినిమా హమ్ దో హమారే దో చిత్రాలు కృతి సనన్ చేతిలో ఉన్నాయ్. మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలతో కృతి సనన్ సూపర్ హిట్ కొడుతుందో చూడాలి. ఏది ఏమైనా ఒక హీరోయిన్ చేతిలో ఏడు సినిమాలు ఉండడం అంటే మాములు విషయం కాదు.