గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఈ సమాజంలో అలాంటి రాక్షసులు ఉన్నారు : కోహ్లీ భార్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ఒక అమ్మాయి పట్ల అంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు ఈ సమాజంలో ఉన్నారంటూ మండిపడ్డారు. 
 
నిజానికి హత్రాస్ హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇటీవలే గర్భందాల్చిన అనుష్క శర్మ కూడా స్పందించారు. చాలా దారుణమైన ఘటన గురించి వినాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
 
ఆడపిల్లల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించే రాక్షసులు కూడా ఉన్నారా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు. పిల్లాడు పుడితే మన సమాజం గొప్పగా, విశేషంగా భావిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, నిజానికి అమ్మాయి పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదని ఆమె చెప్పారు. పిల్లాడు పుడితే అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఈ విషయంగా బాగా ఆలోచించాలని ఆమె తెలిపారు.
 
సమాజం గౌరవించే విధంగా అబ్బాయిలను పెంచాలని, అప్పుడే తాము గొప్ప అని భావించాలని ఆమె చెప్పారు.  ఈ సమాజ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా దీన్ని బాధ్యత అనుకోవాలని చెప్పారు. అబ్బాయి పుడితే ఓ విశేషంలా భావించకూడదని, సమాజంలో మహిళలు సురక్షితంగా, క్షేమంగా బతుకుతున్నామని భావించాలని, ఆ ఈ విధంగా పిల్లల్ని పెంచాలని ఆమె చెప్పారు.