అమలా అక్కినేని పుట్టినరోజు.. బయోగ్రఫీ ఇదే...
టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ అమలా అక్కినేని పుట్టినరోజు నేడు. ఈమె సినీనటిగా, జంతు సంక్షేమ కార్యకర్తగా అందరికీ తెలుసు. దక్షిణాది హీరోయిన్‌గా రాణించిన అమల.. టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలీ యెన్నై కాదలి అనే తమిళ చిత్రంలో తొలిసారిగా అడుగుపెట్టింది.
ఇది పెద్ద బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె చాలా టాలీవుడ్ సినిమాలు, కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. తమిళం, తెలుగులే కాకుండా కొన్ని మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది.
అక్కినేని నాగార్జునతో కలిసి నిర్ణయం, శివ వంటి హిట్ చిత్రాలలో నటించింది. అంతేగాకుండా దక్షిణాది అగ్రహీరోలతో ఆమె కలిసి నటించింది. అలాగే భారతీయరాజా, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖ దర్శకులతో ఆమె పనిచేశారు.
బయోగ్రఫీ
అమల 1967 సెప్టెంబర్ 12న కలకత్తాలో పుట్టారు.
చెన్నైలోని కళాక్షేత్రలో చేరి భరతనాట్యంలో బిఎఫ్ఏ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా నాట్య ప్రదర్శనలు చేశారు.
ఆమె నాట్యానికి ఫిదా అయిన రాజేందర్ సినీ అవకాశం ఇచ్చారు.
తెలుగులో కిరాయిదాదా, రక్తతిలకం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, ఆగ్రం వంటి సినిమాల్లో నటించారు. తెరపై నాగార్జునకు హిట్ పెయిర్‌గా నిలిచిన అమల.. తర్వాత రియల్ లైఫ్‌లోనూ వైఫ్‌గా మారారు. అమల, నాగార్జున సంతానం అఖిల్ చిన్ననాటే సిసింద్రీ సినిమాలో కనిపించారు.
ఇటీవల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించారు. ఆపై మనంలోనూ నటించారు. బుల్లితెరపైనా కొన్ని సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం ఒకే జీవితంలో అమల నటనకు మంచి మార్కులు పడ్డాయి.