శనివారం, 14 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (14:30 IST)

పది లక్షల విరాళం అందచేసిన అంబికా దర్బార్ బత్తి సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ

Ambika krisha, chandrababu
Ambika krisha, chandrababu
గత కొద్దిరోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్ర‌యుల‌య్యారు. భీక‌ర‌మైన న‌ష్టం వాటిల్లింది. ప్ర‌భుత్వాలు వారిని త్వ‌రిత గతిన ఆదుకోవ‌టానికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ అంబికా దర్బార్ బత్తి తరపున వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న‌వంతు సాయం అందించ‌టానికి ముందుకు వ‌చ్చారు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాత  అంబికా కృష్ణ. 
 
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 5లక్షల రూపాయలు విరాళం  ప్రకటించిన అంబిక సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ. ఈ రోజు  గురువారం ఉదయం ఆయన ఎపి సిఎం చంద్రబాబుకు రూ.5లక్షల చెక్కును అందచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ కార్పొరేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహించారు.