బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (13:16 IST)

'దొరసాని' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!

అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన 'దొరసాని' జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతూ... మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ అనంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు.
 
80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా... టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. 'నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే' పాట దొరసానిపై అంచనాలను పెంచాయి. మరోపాట 'కలవరమై.. కలవరమై' ఈనెల 24న రిలీజ్ కానుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని’ ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ దొరసాని వారి ఆశలను ఎంత మేరకు నెరవేర్చుతుందో వేచి చూద్దాం.