గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (12:55 IST)

"కౌసల్య కృష్ణమూర్తి" నుండి ఓ మంచి పాట

గత ఏడాది తమిళంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రధారిగా చేసిన 'కణ' చిత్రం ఘన విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు 'కౌసల్య కృష్ణమూర్తి' పేరిట ఆ సినిమాను ఐశ్వర్య రాజేష్‌తోనే తెలుగులోకి రీమేక్ చేసారు. కే.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమా జూలై 2వ వారంలో విడుదల కాబోతోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'ముద్దబంతి' అనే పాటను విడుదల చేశారు. తమిళంలో 'ఒతాయాడి .. ' అంటూ సాగే ట్యూన్‌లోనే ఈ 'ముద్దబంతి' పాట సాగుతుంది. ఈ తమిళ పాట ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్‌ల వ్యూస్‌ను సాధించడం విశేషం. 
 
 సూపర్ హిట్ అయిన ఆ పాట .. తెలుగులోనూ యూత్ హృదయాలను కొల్లగొట్టడం ఖాయమేనని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. కాగా... ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్‌లు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.