శనివారం, 14 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (14:21 IST)

అశ్వనీదత్ చేతిలో వున్న లెటర్ లో ఏముందో తెలుసా !

Pawan kalyan-aswanidath
Pawan kalyan-aswanidath
వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ చాలా ఖుషీగా వున్నారు. తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీసిన కల్కి చిత్రం అనూహ్య స్పందనతో రెండో రోజు మూడు వందలకుపైగా గ్రాస్ రాబట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు పలువురు నిర్మాతలు వున్నారు. కానీ అశ్వనీదత్ చేతిలో ఓ లెటర్ వుంది. అది ఏమిటి? అనేదానికి ఆయన సమాధానమిచ్చారు.
 
ఆ లెటర్ అనేది కాజువల్. సినిమా సమస్యలతోపాటు లెక్కలు కూడా అందులో వున్నాయి. కల్కి థియేటర్ పెంపు విషయంలోనూ షోల విషయంలోనూ వివరంగా లెక్కలు వేసి కాగితంమీద రాసుకున్నాం. బ్లాక్ టికెట్లను కంట్రోల్ చేసేందుకు ఎక్కువ థియేటర్లు వేశాం. ఒకరకంగా దేవుడి దయ వల్ల అన్నీ సినిమాకు కలిసివచ్చాయని అన్నారు.
 
చంద్రబాబు ద్రుషికి తీసుకెల్ళేందుకు ఉపయోగపడేవి. తెలుగుదేశం 120 సీట్లు సాధిస్తుందని ఎలక్షన్లకు ముందే చెప్పాను. నేను చెప్పింది దాదాపు కరెక్టే అయింది. త్వరలో చంద్రబాబును కలిసి సినిమా సమస్యల గురించి వివరిస్తాం అన్నారు.