సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (14:07 IST)

బాహుబలిపై వెబ్ సిరీస్.. నెట్ ఫ్లిక్స్ అసంతృప్తి.. క్వాలిటీ ఇలా వుందేమిటి?

భారత దేశ చలన చిత్ర చరిత్రనే తిరగరాసి, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఘడించిన బాహుబలి మూవీపై నెట్ ఫ్లిక్స్ అసంతృప్తి వ్యక్తం చేసిందని టాక్ వస్తోంది. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ సినిమా స్థాయి ఆమాంతం పెరిగింది. అయితే బాహుబలి చిత్రాన్ని వెబ్ సిరీస్‌గా తీసుకురావాలని ధర్శకధీరుడు రాజమౌళి భావించారు. 
 
అనుకున్నట్లుగానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లీక్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. బాహుబలి బిగినింగ్ ముందు మహిష్మతి రాజ్యం, శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. దానికి బిఫోర్ ద బిగినింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దాంతో బాహుబలి వెబ్ ‎సిరీస్ వంద కోట్లు పెట్టి రూపొందించాడు.
 
అయితే సిరిస్‌ను భారీ స్థాయిలో షూట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఫైనల్ కట్ చూసుకున్న ఓటీటీ సంస్థ నిర్మాతలకు భారీ షాకిచ్చింది. క్వాలిటీ విషయంలో అసలు రాజీపడని నెట్‌ఫ్లిక్స్‌ ఈ 9 ఎపిసోడ్లు చూసి ఆశ్చర్యపోయిందట. క్వాలిటీ ఇంత డొల్లగా చెత్తగా తయారైందేంటని ప్రశ్నించిందని టాక్. దీంతో ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్‌ చేసినట్లు సమాచారం.
 
దీంతో రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరన్నమాటే. సిరీస్ బాగారాకపోవడానికి బడ్జెట్ అని భావించిన నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా రూ.200 కోట్లు కేటాయించి మరీ ఈ వెబ్‌సిరీస్‌ను సరికొత్తగా ప్లాన్‌ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళితో పాటు ప్రవీణ్ సత్తారు కూడా ఉన్నారు. ఈ సిరీస్ ప్రముఖ దర్శకుడు దేవకట్టా డైరెక్ట్ చేశారు.