శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (18:35 IST)

బాలయ్య - బోయపాటిల బోనాంజ.. బాగుందా?

నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ లోనే బాలయ్యపై ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీన్ షూట్ చేసారు. వారణాసిలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.
 
ఇంతలో కరోనా రావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం… ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో తాజా చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ కన్ఫర్మ్ అనుకున్నారు. ఆ తర్వాత డేంజర్, సూపర్ మేన్, మొనగాడు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ఏదో టైటిల్ ఫిక్స్ చేసి త్వరలో ఎనౌన్స్ చేస్తారని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే… తాజాగా మరో టైటిల్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… బోనాంజ. చిత్ర యూనిట్ అందరికీ బోనాంజ టైటిల్ నచ్చిందని.. ఈ టైటిల్‌నే కన్ఫర్మ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తారో లేక మరో టైటిల్‌ను పెడతారో చూడాలి.