బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (12:45 IST)

శ్రీలీలకు బాబాయ్‌గా బాలయ్య.. భార్యగా కాజల్ అగర్వాల్..

sree leela
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎదిగిన మహిళకు తండ్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య శ్రీలీలకు బాబాయ్‌గా కనిపిస్తున్నారు. బాలకృష్ణ దూకుడు పాత్రలో నటిస్తున్న ఈ ప్లాట్‌ను డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా అభివర్ణించారు. 
 
ఈ చిత్రం తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ భార్యగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
అనిల్ రావిపూడి గతంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చనున్నారు. పేరులేని సినిమా టైటిల్‌ను జూన్ 10న ప్రకటిస్తారు. విడుదల తేదీని విజయ దశమి 2023గా నిర్ణయించారు.