శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (15:44 IST)

రాజ‌మౌళి క్లాప్‌తో ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌

Rajamouli clap
హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేష‌న్‌లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. అగ్ర ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఛత్రపతి’కి ఇది హిందీ రీమేక్.హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, వి.వి.వినాయ‌క్‌, నిర్మాత ధవల్ జ‌యంతిలాల్ గ‌డ‌ స‌హా ముఖ్య అతిథులుగా రాజ‌మౌళి, సుకుమార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముహూర్తపు స‌న్నివేశానికి ద‌ర్శ‌క‌ధీరుడు  ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్ట‌గా, ర‌మా రాజ‌మౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మేక‌ర్స్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్ట్‌ను అందించారు.
 
ఈ సంద‌ర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ ధ‌వ‌ల్ జయంతిలాల్ గడ మాట్లాడుతూ  - ‘‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోతో, ప్రముఖ దర్శకుడు వినాయక్ కాంబినేష‌న్‌లో భారీ చిత్రాన్ని చేస్తున్నందుకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. మా కాంబినేష‌న్‌ ప్రేక్ష‌కులు మెచ్చేలా ఉంటుందని, అలాగే మా కాంబినేష‌న్ ఇండియ‌న్ సినిమాలో ఓ హిస్ట‌రీని క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాం’’ అన్నారు.
 
Vinayak, Rajamouli, etc
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఆయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు హిందీలో అనువాద‌మై యూ ట్యూబ్‌లో మిలియ‌న్స్‌ వ్యూస్‌ను ద‌క్కించుకున్నాయి. ఇదే ఆద‌ర‌ణ కార‌ణంగానే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. బాహుబ‌లితో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్ పాత్ర‌లో బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించ‌బోతున్నాడు. టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించారు. ఆయ‌న ఈ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అల్లుడు శీనుతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన వినాయ‌క్‌గారే బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం చేస్తున్నారు. విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందుకున్న ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను అందించిన పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో డా. జ‌యంతిలాల్ గ‌డ స‌మ‌ర్పడిగా  ధ‌వ‌ల్ జ‌యంతిలాల్ గ‌డ‌, అక్ష‌య్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ మరుదూర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్ కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌లో గ్రాండ్ స్కేల్‌తో సినిమాను రూపొందించ‌నున్నారు.
 
ఛ‌త్ర‌ప‌తి చిత్రానికి క‌థ‌ను అందించిన స్టార్ రైట‌ర్‌, రాజ‌మౌళిగారి తండ్రి కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ రీమేక్‌కు క‌థ‌ను అందిస్తున్నారు. ఆయ‌న క‌థ‌ను అందించిన భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌, మ‌ణిక‌ర్ణిక చిత్రాలు బాలీవుడ్‌లో ఎలాంటి విజ‌యాలు సాధించాలో తెలుసు. ఇప్పుడు బాలీవుడ్ నెటివిటీకి త‌గ్గ‌ట్లు క‌థ‌లో మార్పులు చేర్పులు చేశారు.
 
ఒక అద్భుత‌మైన క‌ల‌యిక‌లో ఈ సినిమా భారీ చిత్రంగా మారింది. ఈ సినిమాలోకి పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇప్పటికే ఫిజికల్‌గా అద్భుతంగా ట్రాన్సార్మ్‌ అయ్యారు. అలాగే బాలీవుడ్‌ సెలబ్రిటీ ట్రైనర్‌ ప్రశాంత్‌ సావంత్‌ పర్యవేక్షణలో హిందీ భాషపై పట్టు, ఉచ్చారణ, డైలాగ్స్‌ డెలివరీ వంటి అంశాల్లో బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ నైపుణ్యతను సాధించారు.
 
ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా చేసేందుకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్‌ చేస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి తెలుగు హిట్‌ సినిమాలతో పాటుగా, తమిళ సినిమాలకు కూడా పని చేసిన సినిమాటోగ్రాఫర్‌ నిజర్‌ అలీ షఫీ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. తనిష్క్‌ బాచి ఈ చిత్రానికి స్వరకర్త. అన‌ల్‌ అర‌సు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మహర్షి, గజిని, స్పెషల్‌ 26 వంటి చిత్రాలకు పని చేసిన ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌బాబు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మయూర్‌ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తున్నారు.
 
రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ సినిమా సెట్‌ వేసిన లొకేషన్‌లోనే ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌ కోసం ఓ పెద్ద సెట్‌ను క్రియేట్‌ చేశారు. ఈ రోజు (జూలై 16) నుంచి ఈ లాంగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలవుతుంది.
 
నటీన‌టులు:
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సాహిల్ వైద్‌, అమిత్ నాయ‌ర్‌, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్‌, స్వ‌ప్నిల్‌, అశిష్ సింగ్‌, మ‌హ్మ‌ద్ మోనాజిర్‌, అరుషిక దే, వేదిక‌, జాస‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వి.వి.వినాయ‌క్‌
క‌థ‌: కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌: డా.జ‌యంతిలాల్ గ‌డ‌
నిర్మాత‌లు: ధ‌వ‌ల్ జ‌యంతి లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతిలాల్ గ‌డ‌
బ్యాన‌ర్స్‌: పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పెన్ స్టూడియోస్
సినిమాటోగ్ర‌ఫీ: నాజిర్ అలీ షఫీ
స్టంట్స్‌: అన‌ల్ అర‌సు
మ్యూజిక్‌: త‌నిష్క్ బ‌గ్చి
డైలాగ్స్‌: మయూర్ పూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సునీల్ బాబు
ఆర్ట్‌: శ్రీను
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అర్చా మెహ‌తా
అసోసియేట్ డైరెక్ట‌ర్‌: స‌ఫ్ద‌ర్ అబ్బాస్‌