బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జునా..? సమంతా..?

Samantha-Nagarjuna
శ్రీ| Last Modified శనివారం, 27 జూన్ 2020 (18:50 IST)
స్టార్ మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ జీన్‌లో ఎన్టీఆర్ సందర్భానుసారంగా చేసిన వ్యాఖ్యానం బాగా ఆకట్టుకుంది. సెకండ్ సీజన్‌కి కూడా ఎన్టీఆరే హోస్ట్ అనుకున్నారు కానీ.. షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన కుదరలేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.

అయితే...సోషల్ మీడియాలో నాని హోస్ట్‌గా చేయడం గురించి కామెంట్స్ చేయడంతో ఎప్పుడు ఈ షో అయపోతుందా అని నాని ఎదురుచూసాడని విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత బిగ్ బాస్ 3కి ఎవరు హోస్ట్‌గా చేస్తారనుకుంటే... టాలీవుడ్ కింగ్ రంగంలోకి దిగారు. ఆయన తనదైన శైలిలో యాంకరింగ్ చేసి అదరగొట్టేసారు. దీంతో నాగార్జున హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ 3 రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నాలుగవ సీజన్ రాబోతుంది.

మరి.. ఈసారి ఎవరు హోస్ట్‌గా ఉంటారు అంటే.. కొంతమంది పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఫైనల్‌గా మళ్లీ నాగార్జునే చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే... ఉన్నట్టుండి తెర పైకి సమంత పేరు వచ్చింది.


ఈసారి సమంత బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది నిజమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే...
సమంత హోస్ట్‌గా చేయడం అనే వార్తలో వాస్తవం లేదని తెలిసింది. నాగార్జునే మళ్లీ బిగ్ బాస్ హోస్ట్‌గా రానున్నారని సమాచారం. ఆగష్టులో ఇది ప్రారంభం కానున్నట్టు టాక్.దీనిపై మరింత చదవండి :