గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (15:59 IST)

బిగ్ బాస్ ఆరో సీజన్‌ ఫైనల్ విజేత ఎవరు.. గూగుల్ ఏం చెప్తోంది?

Rohit
Rohit
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫైనల్ విజేత ఎవరనే దానిపై అప్పుడు వివరాలు వెలుగులోకి వచ్చేశాయి. గూగుల్ బిగ్ బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరో చెప్పేసింది. డిసెంబర్ 18 ఆదివారం విజేత ఎవరనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్‌లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, శ్రీహాన్ ఉన్నారు. 
 
వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి పారిపోయారు. బుధవారం వరకు వచ్చిన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇక ఈ విషయం హౌస్ మేట్స్‌కి కూడా తెలియదు. శ్రీ సత్య, కీర్తి రెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. 
 
ఇక ఫైనల్‌కి చేరిన ఈ ఐదుగురు కంటెస్టెంట్స్‌లో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్‌గా నిలుస్తారు. ఈ విన్నర్‌కి రూ.50లక్షలతో పాటు రూ.25లక్షల విలువైన ఫ్లాట్ కూడా అందుకుంటారు. 
 
ప్రస్తుతం ఆడియన్స్ ఎవరనేదానిపై ప్రస్తుతం నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఇక సెర్చ్ చేసిన వారికి షాకింగ్ ఆన్సర్ దక్కింది. అయితే గూగుల్ చెప్తున్న దాని ప్రకారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ రోహిత్ అని తెలుస్తుంది.