సినీ ప్రియులకు శుభవార్త : 18 నుంచి థియేటర్లలో బొమ్మ
తెలంగాణా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. గత కొద్ది నెలల నుంచి మూతపడివున్న సినిమా థియేటర్లు తెలంగాణాలో తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో రేపటి నుంచి థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్‌పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పని చేసే సిబ్బంది ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.
ఈ భేటీ కంటే ముందు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, కిశోర్ బాబు, అభిషేక్ నామా, బాల గోవిందరాజు సమావేశం అయ్యారు. థియేటర్లకు ప్రకటించిన రాయితీలపై ఉత్తర్వులు జారీ చేయాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.