గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (17:49 IST)

రాజా సర్ కస్టడీకి కంపోజ్ చేయడం చాలా అనందంగా వుంది : నాగ చైతన్య

Ilayaraja, Naga Chaitanya, Venkat Prabhu, Srinivasa Chitturi
Ilayaraja, Naga Chaitanya, Venkat Prabhu, Srinivasa Chitturi
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
 
ఇదీలావుండగా లెజెండరీ కంపోజర్ ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా "రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్" కోసం హైదరాబాద్‌ కి వచ్చారు. కస్టడీ యూనిట్ లెజెండ్ ఇళయరాజాను కలుసుకుని అభినందించింది.
 
నాగ చైతన్య ఫోటోలని పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని పంచుకున్నారు. "మాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలవడం  గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వినుకుంటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను.  ఇప్పుడు రాజా సర్ ‘కస్టడీ’ చిత్రం కోసం కంపోజ్ చేయడం చాలా అనందంగా వుంది."అన్నారు
 
ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.